గ్రహాలకు రాజు సూర్యుడు ఒక నిర్దిష్ట సమయంలో తన రాశి స్థానాన్ని మారుస్తాడు. 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చే సూర్యుడు రాశి చక్రం పూర్తి చేయడానికి సుమారు యేడాది కాలం పడుతుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న సూర్యుడు ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుస్సు రాశి బృహస్పతికి, సూర్యుడికి మిత్రుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని రాశుల వారి దైనందిన జీవితంలో మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆరు రాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ధనస్సు రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఏయే రాశుల వారి జీవితాల్లో కీలక మలుపు రానుందో తెలుసుకుందాం.