ఇంట్లో ప్రతికూల శక్తులుంటే ఏమవుతుంది?
వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతికూల శక్తులు అంటే భూతాలు, దెయ్యాలు, పిశాచాలు, ఇతర నెగటివ్ ఎనర్జీలు మనిషి జీవితంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఇంట్లో లేదా కార్యాలయంలో ఇవి ప్రవేశించడం వల్ల తరచూ శారీరక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాల్లో నష్టాలు, మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, నిరాశ, ఆందోళన, నెగిటివిటీ, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, పనుల్లో పరాజయాలు, ప్రయత్నాల్లో లోపాలు, నిద్రలేమి, అశాంతి, భయం వంటి సమస్యలు తలెత్తుతాయి.