“ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లకు పని చేయటం అనేది యంగ్ టాలెంట్, యంగ్ టెక్నీషియన్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్. అయితే వర్క్ పరంగా ఎప్పటికప్పుడు హిందీ, ఫ్రెంచ్, కొరియన్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామని అప్‌డేట్ కావటం మానుకోలేం’’ అని అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. తాజాగా ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెట్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు ఆమె వర్క్ చేశారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్‌లో తన వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నేపథ్యం
– నేను పుట్టింది విజయనగరం.. పెరిగిందంతా చెన్నై. ఇంటర్ వరకు చెన్నైలోనే చదువుకున్నాను. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సామ్ సంగ్‌లో జాబ్ చేశాను. తర్వాత మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అయ్యాను. ఆ సమయంలో నేను హైదరాబాద్ వచ్చాను. ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌లో డెవలపర్‌గా వర్క్ చేశాను. మూడేళ్లు హైదరాబాద్‌లో వర్క్ చేసిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో జాబ్‌కి రిజైన్ చేసేశాను.
ఫ్యాషన్ డిజైనర్‌గా ఎలా మారారు?
– జాబ్ రిజైన్ చేసిన తర్వాత బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. ఆ సమయంలోనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాను. ఇంట్లో కుట్లు, అల్లికలు నేర్పించటం వల్ల అయితే కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే బిజినెస్ పెట్టటానికి బావుంటుందనిపించింది. నలబై ఏళ్లు వచ్చిన తర్వాత బోటిక్ బిజినెస్ పెడదామని అనుకుంటుండేదాన్ని. కానీ.. ఎలాగూ జాబ్ రిజైన్ చేశాం కదా.. ఇప్పుడు బోటిక్ బిజినెస్ పెడదామని నిర్ణయానికి వచ్చాను. దాంతో హాంస్టెగ్‌లో ఏడాదిపాటు ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లోమా కోర్స్ చేశాను. కోర్స్ కాగానే ఫ్యాషన్ షో కూడా చేశాను. ఆ తర్వాత ఏడాదిలోనే నన్ను మెంటర్‌గా కూడా పిలిచారు… అది కూడా చేశాను. ఎంత ప్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసినప్పటికీ ఓ గార్మెంట్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ కూడా మాకు వచ్చి ఉండాలి. ఫ్యాబ్రిక్ కొనటం దగ్గర నుంచి వర్క్ పూర్తయిన దాన్ని ఎంతకు నేను సేల్ చేస్తాననే వరకు నాకు తెలియాలి. అందువల్ల ఫ్యాషన్ షో మెంటర్‌గా వర్క్ చేశాను. నా దగ్గర 7 టీమ్స్ ఉండేవి. తర్వాత నేనే సొంతంగా బోటిక్ బిజినెస్ స్టార్ట్ చేశాను. 2019వరకు బోటిక్ బిజినెస్ బాగానే వర్క్ అవుతూ వచ్చింది. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత బిజినెస్ క్లోజ్ చేసేశాను. ఇప్పుడు ఇంకా పెద్ద స్థాయిలో బిజినెస్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను.
సినీ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?
– రెగ్యులర్‌గా ఇతర డిజైనర్స్ వచ్చి నా దగ్గర స్టిచింగ్ చేసుకుని వెళుతుండేవారు. అలా మొదలైన ఈ ప్రయాణంతో నేను కూడా మెల్లగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. పలాస మూవీకి నేను డిజైనింగ్ మాత్రమే చేసిచ్చాను… షూట్‌కి వెళ్లలేదు. అయితే ఆహా వాళ్లు చేసిన కుడిఎడమైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా నా కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. తర్వాత పారాహుషార్ అనే మరో సినిమాకు వర్క్ చేశాను. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత కరుణకుమార్‌గారు రూపొందించిన కళాపురం సినిమాకు వర్క్‌చేశాను. తర్వాత ప్రదీప్ మద్దాలిగారు డైరెక్ట్ చేసిన సర్వం శక్తిమయం సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనింగ్ వర్క్‌చేశాను. ఈ వెబ్ సిరీస్ నాకు చాలా ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఓ ఫుల్ ఔట్‌డోర్ ప్రాజెక్ట్‌ని తక్కవు బడ్జెట్..తక్కువ మ్యాన్ పవర్‌తో ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకున్నాను.
పీరియాడిక్ సిరీస్ వికటకవికి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
– సర్వం శక్తి మయం సిరీస్‌కు పని చేయటం నాకు వికటకవి సిరీస్‌కు వర్క్ చేయటానికి ఎంతగానో హెల్ప్ అయ్యింది. నిజానికి సర్వం శక్తిమయం సిరీస్ తర్వాత పీపుల్ మీడియా బ్యానర్ సంస్థ నిర్మించిన సిరీస్ హరికథకు వర్క్ చేశాను. అది కూడా పీరియాడిక్ సిరీస్ 90వ దశకం కథ,కథనంతో రూపొందింది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రీరోజెస్ ఫేమ్ మ్యాగీ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. దీంతో పాటు వికటకవి సిరీస్‌కు వర్క్ చేసే అవకాశం ఒకేసారి వచ్చింది. పీరియాడిక్ సిరీస్‌ల్లో హరికథ ముందుగా స్టార్ట్ అయ్యింది. ఒక సిరీస్ షూట్ ఉన్నప్పుడు మరో సిరీస్ షూట్ లేకుండా ఉండటం కూడా కాస్త కలిసొచ్చింది. అలాగే హరికథ చేసిన వర్క్ వికటకవి విషయంలో హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సిరీస్‌లకు వర్క్ చేయటం అనేది రెగ్యులర్‌గా సాధ్యంకాదు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలంతే.
సినిమాలు..సిరీస్‌లు.. రెండింటికి వర్క్ చేయటంలో ఉన్న వత్యాసం ఏంటి?
– సిరీస్‌లకు వర్క్ చేసే సమయంలో బడ్జెట్‌కు సంబంధించిన పరిమితులుంటాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఔట్‌పుట్ ఎదురు చూస్తారు. అయితే సినిమాల విషయానికి వచ్చే సరికి బడ్జెట్ విషయంలో కాస్త వెసులుబాటు ఉంటుంది. సిరీస్‌లకు వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్‌తో పాటు ఓటీటీలకు సంబంధించిన ఇన్‌పుట్స్ చాలానే ఉంటాయి. కానీ సినిమాల్లో మాత్రం డైరెక్టరే ఫైనల్ డిసిషన్ మేకర్.
టెక్నీషియన్‌గా ఎలా అప్‌డేట్ అవుతుంటారు?
– టెక్నిషియన్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. నేను సినిమాలు చేసిన తర్వాత వెబ్ సిరీస్‌లకు వర్క్ చేయలేదు. సిరీస్‌లకు వర్క్ చేయటంతోనే కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌లకు పని చేయటం అనేది యంగ్ టాలెంట్, యంగ్ టెక్నీషియన్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్. అయితే వర్క్ పరంగా ఎప్పటికప్పుడు హిందీ, ఫ్రెంచ్, కొరియన్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామని అప్‌డేట్ కావటం మానుకోలేం.
‘వికటకవి’ సిరీస్ వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
– వికటకవి సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది. అది కూడా పీరియాడిక్ కథాంశం కావటంతో, చాలా రీసెర్చ్ చేశాను. 1940 సమయంలో హైదరాబాద్ ఎలా ఉండిందో ముందు నేను తెలుసుకోవాలనుకుంటున్న సమయంలో మా అసోసియేట్స్ ఏం చెప్పారంటే ‘మాభూమి’ అనే తెలంగాణ మూవీని చూడమన్నారు. ఆ సినిమా ద్వారా నాటి హైదరాబాద్ ఎలా ఉండింది.. అప్పటి ప్రజల వేషధారణ, సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలిసింది. అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉండిందనే దానిపై లైబ్రరీకి వెళ్లి ఆర్టికల్స్ చదివాను. దాన్ని నేను కథకు తగ్గట్టు ఎలా చూపించాలి.. ఎలా లిబర్టీ తీసుకోవాలనే దానిపై ఆలోచన చేసుకున్నాను. దానికి తగ్గట్టు టీమ్‌ను ప్రిపేర్ చేశాను. కథకు తగ్గట్లు ప్యాంట్, షర్ట్ ఎలా ఉండాలనే దానిపై వీడియోలను డౌన్ లోడ్ చేశాను. లుక్ టెస్టులను చేశాం. టెక్నీషియన్స్‌గా ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది.
‘వికటకవి’లో మీకు చాలెంజింగ్‌గా అనిపించిందేంటి?
– ఫ్యాబ్రిక్స్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.. ముందు మేం అనుకున్నది వేరు. కానీ కథకు తగ్గ మూడ్ ప్రకారం చూస్తే ఫ్యాబ్రిక్స్‌ను మార్చాల్సి వచ్చింది. హీరో లుక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అప్పటి లుక్‌లో కనిపిస్తూనే పొడవుగా కనిపించాలి.. ఇవన్నీ మాకు చాలెంజింగ్‌గా అనిపించాయి. అయితే వాటన్నింటినీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. మేఘా ఆకాష్‌గారికి ముందుగా చుడీదార్ అనుకున్నాం. కానీ కథానుగుణంగా చుడీదార్ కంటే శారీనే బాగా నప్పుతుందనిపించింది. అలాగని పట్టు శారీలను ఉపయోగించలేదు. కాటన్, లెనిన్, ఖాదీ చీరలనే ఉపయోగించాం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
– ప్రస్తుతం సతీష్ వేగేశ్నగారు దర్శకత్వంలో హాట్ స్టార్ రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ మర్మయోగి కోసం వర్క్ చేస్తున్నాను. రీసెంట్‌గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మానసచోర అనే సినిమాకు వర్క్ చేస్తున్నాను.