వృషభ రాశి :
వృషభరాశి వారికి ఈవారం అనుకూలంగా లేదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారపరంగా మధ్యస్థ సమయం. చేపట్టిన పనులు ఆలస్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటా బయట సమస్యలు చికాకుపరుస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు పని ఒత్తిళ్ళు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. వృషభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.