10. రవికుమార్ ఎస్ – కాగ్నిజెంట్

సీఈఓ రవికుమార్ ఎస్ ఆధ్వర్యంలో కాగ్నిజెంట్ సుస్థిర వృద్ధిని నిర్ధారించడం, దీర్ఘకాలిక వాటాదారుల విలువను పెంచడంపై దృష్టి సారించింది. డిజిటల్ పరివర్తన, సంప్రదాయ సాంకేతికత, ఇంజనీరింగ్ సేవలు, డేటా అండ్ అనలిటిక్స్, క్లౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్సల్టింగ్ లో రవికుమార్ కు విశేష అనుభవం ఉంది. కాగ్నిజెంట్ సిఇఒ కావడానికి ముందు, రవి కుమార్ ఎస్ ఇన్ఫోసిస్ (infosys) ప్రెసిడెంట్ గా ఉన్నారు. అక్కడ అతను కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ విభాగాన్ని పర్యవేక్షించాడు. తన కెరీర్ తొలినాళ్లలో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియాలో న్యూక్లియర్ సైంటిస్ట్ గా పనిచేశారు. శివాజీ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ, జేవియర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here