డిసెంబర్ 5 న రాబోతున్న అల్లు అర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కి ఒక రోజు ముందు, అంటేడిసెంబర్ 4 వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో నైట్ తొమ్మిదిన్నర కి ప్రీమియర్ షోస్ కూడా పడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పుష్ప టికెట్స్ రేట్స్ ని పెంచుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది.
ఇక రీసెంట్ గా ప్రముఖ నిర్మాత నట్టి కుమార్(natti kumar)పుష్ప 2 టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతు కొంత మంది దళారులు పుష్ప 2 టికెట్స్ ని నాలుగువేలు,ఐదు వేలు,ఆరు వేల కి అమ్మడానికి వాట్స్ అప్ గ్రూప్ లని ఏర్పాటు చేసుకున్నాయి.కాబట్టి అల్లు అర్జున్ గారికి నా విన్నపం ఒక్కటే, మనకి ఫ్యామిలీ తర్వాత ఫ్యాన్స్ నే ఫ్యామిలీ.కాబట్టి ఫ్యాన్స్ అందరకి మీరు చెప్పండి. దయ చేసి బ్లాక్ మార్కెట్ లో ఎవరు టికెట్స్ కొనవద్దు,గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకే కొనమని చెప్పండి. మీకు ఏడూ వేల జీతగాడు దగ్గర్నుంచి, ఏడూలక్షల జీత గాడు దాకా అభిమానులు ఉన్నారు.వాళ్ళందరూ మీ సినిమా చూడాలి కాబట్టి దళారుల దగ్గర టికెట్ కొనవద్దని అభిమానులకి చెప్పండని నట్టి కుమార్ చెప్పుకొచ్చాడు.