అసలేంటీ జీవో 317?
2018లో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. తెలంగాణ విభజనకు ముందు మొత్తం పది జిల్లాలు జోన్-5, జోన్-6 కింద ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం 31 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా పునర్‌వ్యవస్థీకరించారు. దీనిని 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిది. ఈలోగా జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లుగా మూడంచెల కేడర్లకు రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్ల వ్యవస్థ అమలులోకి రావటం, కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు, ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.