15 దేశాల్లో ట్రెండింగ్
నెట్‌ఫ్లిక్స్ టాప్ 1 ప్లేస్‌లో లక్కీ భాస్కర్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోన్న విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. “ఇళ్లలో కూడా లక్కీ భాస్కర్ మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 15 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల్లో టాప్ 1 స్థానంలో లక్కీ భాస్కర్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది” అని ట్వీట్ చేశారు.