భారతీయులు చేసే వంటకాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లికి ప్రాధాన్యత ఎక్కువ. ఇవి ఆహారానికి మంచి రుచిని, సువాసనను అందించడంతో పాటు మెండైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. అయితే హిందువుల నమ్మకాల ప్రకారం అయ్యప్ప మాల, హనుమాన్ మాల, శివ మాల వంటి మాలధారణ సమయాల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లితో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. పండగలు, ప్రత్యేక పూజల సమయాల్లో ఉపవాసాలు చేసే వారు కూడా ఆ రోజు ఉల్లిపాయ, వెల్లులికి దూరంగా ఉండాలని చెబుతారు. ఆధ్మాత్మిక భాషలో చెప్పాలంటే ఉల్లిపాయ, వెల్లులిని తామసిక ఆహారాల జాబితాలో చేరుస్తారు. అలా ఎందుకంటారు మాలధారణ, ఉపవాస సమయాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లితో తయారు చేసిన ఆహారాలను ఎందుకు తీసుకోకూడదు తెలుసుకుందాం.