ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ అడుగుపెట్టేసింది. ఈ నెల ముగిస్తే 2024 ఏడాదికి కూడా తెరపడిపోతుంది. 2025 సంవత్సరంలో అడుగుపెడతాం. అయితే, గడిచిన సంత్సరంలో ఏం చేశాం.. ఊరికే అలా అయిపోయిందే అని చాలా మంది బాధపడుతుంటారు. చాలా పనులు చేసినా అలా అసంతృప్తి ఫీల్ అవుతుంటారు. అయితే, డిసెంబర్లో కొన్ని పనులు చేస్తే ఓ క్లారిటీ వస్తుంది. సంతోషం, సంతృప్తిగా అనిపిస్తుంది. అలా ఏడాది చివరి నెలలో తప్పక చేయాల్సిన పనులు ఇవే.