హెచ్ఐవీ, ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించేందుకు, ఈ వ్యాధి వల్ల మరణించిన బాధితులను గుర్తు చేసుకునేందుకు నేడు (డిసెంబర్ 1) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుగుతోంది. 1988 నుంచి ప్రతీ ఏడాది ఇదే తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డే నిర్వహణ సాగుతోంది. అయినా ఇప్పటికీ హెచ్ఐవీ, ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూనో డిఫీషియన్సీ సిండ్రోమ్) గురించి అవగాహన లోపం ఎక్కువగానే ఉంది. ఎలా వ్యాప్తి అవుతోందో చాలా మందికి తెలియదు. అందుకే ఈ వ్యాధి గురించి కొన్ని అపోహలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. నేడు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా.. ఆ అపోహలు ఏవో.. నిజాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.