ఇటీవల టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 3వ తేదీ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. డిసెంబరు 2వ తేదీన తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారు.
Home Andhra Pradesh తిరుమల శ్రీవారి దర్శనాలు, స్థానికుల కోటా మార్గదర్శకాలివే-tirumala srivari darshan ttd guidelines for tirupati...