ఊబకాయంతో పిల్లల్లో ఈ సమస్యలు
ఊబకాయం వల్ల చిన్న తనం నుంచే సమస్యలు మొదలై.. పెద్దయ్యాక కూడా కొనసాగుతాయని అభిషేక్ చెప్పారు. చిన్నతనం నుంచి ఊబకాయం ఉంటే గుండె వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుందని తెలిపారు. “చిన్నతనం నుంచే ఊబకాయం ఉండడం వల్ల హై బ్లడ్ ప్రెజర్, బ్లడ్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇవి పెద్దయ్యాక కూడా కొనసాగుతాయి. ఈ కారకాల కలయిక వల్ల ధమనులు, గుండె డ్యామేజ్ అయ్యేందుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నతనంలో ఊబకాయంతో ఉన్న పిల్లలు.. పెద్దయ్యాక కూడా ఉండాల్సిన దాని కంటే అధిక బరువుతో ఉండే రిస్క్ ఐదు రెట్లు అధికంగా ఉంటుంది. అందుకే చిన్నతనంలోనే ఊబకాయం రాకుండా జాగ్రత్త పడాలి. వచ్చినా త్వరగా తగ్గేలా చర్యలు తీసుకోవాలి.