కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ మేనియా కనిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మెప్పించింది. ముఖ్యంగా ‘పుష్ప పుష్ప’, ‘సూసేకి’, ‘కిస్సిక్’ అనే సాంగ్స్ విడుదల కాగా, మూడూ కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. (Pushpa 2 The Rule)

‘పుష్ప-2’ నుంచి ‘పీలింగ్స్’ అనే సాంగ్ ని తాజాగా విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ డ్యాన్స్ నెంబర్.. మలయాళ లిరిక్స్ తో ప్రారంభమవ్వడం విశేషం. చంద్రబోస్ తెలుగు లిరిక్స్ అందించిన ఈ పాటను.. శంకర్ బాబు, లక్ష్మి ఆలపించారు. ఈ సాంగ్ ని మాస్ ని మెప్పించేలా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్, రష్మిక డ్యాన్స్ అదరగొట్టారు. థియేటర్లలో ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశముంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here