వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో 13వ పురాణం ‘స్కాంద (స్కంద) పురాణం’ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. 81వేల శ్లోకాలు గల స్కాందపురాణం ద్వారా మనకు శివుని జీవిత విశేషాలు, దక్షిణాసియాకు సంబంధించిన భౌగోళిక వివరాలు, తీర్థాలు, క్షేత్రాలు, విశ్వరూపం, వేదాంతం, రత్నశాస్త్రం, వంశావళి వివరాలు ఉన్నాయన్నారు. పరమేశ్వరుడు తన కుమారుడు అయిన స్కందునకు (కుమారస్వామికి) చెప్పినట్లుగా, తండ్రి చెప్పిన అంశాలను స్కందుడు మహర్షులకు చెప్పినట్లుగా ఈ పురాణం మనకు దర్శనమిస్తుందన్నారు.