హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్ సహా పలువురు ప్రముఖులని వ్యాపారం పేరుతో మోసం చేసిన తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంతి దత్ ‘సస్టెయిన్ కార్ట్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల చేత పెట్టుబడులు పెట్టించి మోసం చేశాడట. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన శ్రీజ రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, పరిణీతి చోప్రా, డిజైనర్ శిల్పా రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు సస్టెయిన్ కార్ట్ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు వార్తలొస్తున్నాయి.
విశాఖకు చెందిన కాంతి దత్, మొదట శిల్పా రెడ్డిని బిజినెస్ పార్టనర్ గా చేసుకొని వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆమె ద్వారా సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకొని, పలువురు చేత కాంతి దత్ పెట్టుబడులు పెట్టించాడట. అది మోసమని శిల్పా రెడ్డితో సహా అందరూ ఆలస్యంగా గ్రహించినట్లు తెలుస్తోంది.