క్రమం తప్పకుండా పోషకాహారాలతో కూడిన డైట్ పాటిస్తూ, వర్కౌట్స్ చేస్తూ ఉంటే క్రమంగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గే ప్రయత్నంలో క్రమశిక్షణ చాలా అవసరం. తాము బరువు తగ్గామని, పాటించిన డైట్, పద్ధతులను ఇన్స్టాగ్రామ్లో కొందరు షేర్ చేస్తున్నారు. రిచా గంగానీ అనే డైటీషన్ తాజాగా తన వెయిట్ లాస్ జర్నీని వెల్లడించారు. అయితే, 21 రోజుల్లోనే ఏకంగా 7 కేజీల బరువు తగ్గానంటూ ఆశ్చర్యపరిచారు. ఈ కాలంలో తాను ఏం తిన్నారో పూర్తిగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.