AP Heavy Rains : ఫెంగల్ తుపాను ఏపీని వణికిస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లా తల్లడిల్లిపోయింది. అతిభారీ వర్షాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కేఎం అగ్రహారంలో 187 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.