కావ్యనే కారణమంటూ
పక్కనే ఉన్న కావ్య అత్తయ్య గారు మావయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏమిటి అని అయోమయంగా అడుగుతుంది. దానికి షటప్ అని కావ్యపై కోపంగా అరుస్తాడు రాజ్. మీ ఇంట్లో అంతా కలిసి మా మమ్మీకి ఏం నూరిపోశారు అని కావ్యపై ఫైర్ అవుతాడు. కనకం, కావ్య కావాలనే తన తల్లిని ఇంటికి పిలిపించుకుని లేనిపోనివి చెప్పి ఇలా చేయిస్తున్నారని, దీనంతటికి కారణం కావ్యనే అని రాజ్ నిందిస్తాడు. దానికి రాజ్‌కు రుద్రాణి సపోర్ట్ చేస్తూ మరింత ఆజ్యం పోస్తుంది.