నోరుజారి.. ట్రోలింగ్‌కి గురైన విఘ్నేశ్ శివన్

ధనుష్, నయనతార వివాదంలో.. ధనుష్‌ని కార్నర్ చేయబోయిన విఘ్నేశ్ శివన్ నోరుజారాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేనూ రౌడీనే సినిమాని చూసి.. అజిత్ తన మూవీ ఎంతవాడు గాని సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చాడని విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. అయితే.. ‘ఎంతవాడు గాని’ మూవీ రిలీజ్ తర్వాతే.. నేనూ రౌడీనే సినిమా వచ్చింది కదా? మరి అజిత్ ఎలా ఆ  సినిమా చూసి.. నీకు ఛాన్స్ ఇచ్చాడు అని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలెట్టారు. ధనుష్ ఫ్యాన్స్ అయితే.. అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ హద్దు ఉంటుంది అంటూ శివన్‌ని ఏకిపారేస్తున్నారు. దాంతో  శివమ్ విఘ్నేశ్ నుంచి సమాధానం లేకపోయింది. చివరికి ట్రోలింగ్‌ను భరించలేక.. ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌ను విఘ్నేశ్ శివన్ డీయాక్టివేట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here