విద్యుత్ ఛార్జీల భారంలో బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం, జనసేనలు ఉన్నాయని బడా కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలు వలనే విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని ఆరోపించారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై ప్రజలు గళం విప్పాలి. కేంద్ర, రాష్ట్ర పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ పాపాన్ని గమనించాలని, మరో విద్యుత్ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల భారాన్ని నిలిపివేయాలని, అదానీ, జగన్, కేంద్ర ప్రభుత్వ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. మాట ఇచ్చినట్లు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, స్మార్ట్ మీటర్లను ఆపాలని డిమాండ్ చేశారు.
Home Andhra Pradesh ఏపీలో పెరిగిన విద్యుత్ బిల్లులు, కొత్త సర్దుపోటు మొదలు, విద్యుత్ పోరాటాలకు సీపీఎం పిలుపు..-ap consumers...