ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు బోర్డు సోమవారం నోటిపికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ పరిధిలోని మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టులు, పీహెచ్‌సీలు, ఇతర వైద్య ఆరోగ్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థులను నుంచి డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో https://apmsrb.ap.gov.in/msrb/ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Home Andhra Pradesh నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్,280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్-ap medical...