“మాసానాం మార్గశీర్షోహం” – అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటివారితో పాటు స్వయం భగవానుముఖతః ప్రకటితమైన, శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం మార్గశిరం. అందుకే మాసాలన్నింలోనూ మార్గశిర మాసానికి ప్రత్యేక విశిష్టత ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మార్గశిర మాసం విశిష్టత ఏంటి? ఈ మాసంలో వచ్చే పర్వదినాలె, ఆ రోజుల్లో పాటించాల్సిన నియమాలను గురించి ఆయన చెబుతున్నారో తెలుసుకుందాం.