సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి. సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సందర్శిస్తే.. ఆ సమయంలో వెహికిల్‌పై ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా? అనేది కూడా తెలుస్తుంది. అది ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుంది.