వివో టీ3 ప్రో 5జీ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దాని మొదటి కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్ కెపాసిటీలో ఉంది. ఈ ఫోన్ సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. దీని సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ ఉంటుంది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ సదుపాయాన్ని కూడా పొందుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-C, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌ను తక్కువ ధరలో కొనాలి అనుకుంటే ఇప్పుడే సరైన సమయం.