దీనిపై స్పందించిన గైనిక్ విభాగం హెచ్వోడీ షంషాద్బేగం.. తల్లిని బతికించాలని చూశామన్నారు. జ్యోతికి రక్షహీనత ఉండడంతో రెండు యూనిట్ల రక్తం అందించామని చెప్పారు. నెలలు నిండకపోవడంతో పాటు బాత్రూంకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి పడిపోయిందన్నారు. అప్పటికే పల్స్ లేదని, తల్లిని రక్షించాలనే ఉద్దేశంతో సిజేరియన్ చేశామని చెప్పారు. కార్డియాక్ అరెస్టు అయి ఆమె మరణించారని చెప్పారు. ఈ ఘటనపై విచారిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వివరించారు. సిబ్బంది, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Home Andhra Pradesh అనంతపురంలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్దల మృతి-mother and child died due to negligence...