సూపర్ స్టార్ రజనీకాంత్(rajinikanth)నుంచి గత సంవత్సరం ఆగస్టులోప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జైలర్(jailer).రజనీని వరుస పరాజయాల నుంచి బయటపడేసిన ఈ మూవీ,రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు ఆరువందల యాభై కోట్ల రూపాయిలని వసూలు చేసింది.దీన్ని బట్టి జైలర్ హిట్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.నెల్సన్ దిలీప్ కుమార్(nelson dilipkumar)ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఎవీఎం సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది.
జైలర్ కి సీక్వెల్ గా జైలర్ పార్ట్ 2(jailer 2)కూడా ఉందన్న విషయం తెలిసిందే. జైలర్ రిలీజ్ టైంలోనే మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా వెల్లడి కూడా చేసారు.నెల్సన్ ఇప్పటికే జైలర్ 2 స్క్రిప్టును కూడా రెడీ చేశాడు.స్వయంగా నెల్సన్ నే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాడు.కాకపోతే కొన్ని రోజులుగా జైలర్ 2 గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.కానీ ఇప్పుడు డిసెంబర్ 5న రజినీకాంత్ బర్త్ డే ని పురస్కరించుకొని జైలర్ 2 నుంచి సాలిడ్ ట్రీట్ రానున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక జైలర్ 2 లో పార్ట్ 1 ని మించి సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయని తెలుస్తుంది.పార్ట్ 1 లో మోహన్ లాల్,శివ రాజ్‌కుమార్,జాకీష్రాఫ్ వంటి మేటి నటులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా వాళ్ళని మించిన స్టార్స్ స్పెషల్ క్యారెక్టర్స్ లో కనపడబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.అయితే ఆ స్టార్స్ ఎవరెవరు అనే ఆసక్తి రజనీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులోను ఉంది.