2024 KTM 250 డ్యూక్: ఇంజిన్
యాంత్రికంగా, 2024 కేటీఎం 250 డ్యూక్ (2024 KTM 250 Duke) లో ఇతర మార్పులు లేవు. ఇది పాత మోడల్ తరహాలోనే 248 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 9,250 rpm వద్ద 30 bhp గరిష్ట శక్తిని, 7,250 rpm వద్ద 25 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేయగలదు. బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో వచ్చే ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇంజిన్ జత చేయబడింది.