స్ప్రేలు, కెమికల్స్ విషయంలో జాగ్రత్త
టీవీ స్క్రీన్లను క్లీన్ చేసేందుకు హానికర కెమికల్స్ అసలు వాడకూడదు. ఇవి వాడితే డిస్ప్లే మరకలు పడడమే కాకుండా.. డ్యామేజ్ కూడా కావొచ్చు. కోటింగ్ దెబ్బతినొచ్చు. అల్కహాల్, అమ్మోనియా లాంటివి వినియోగించకూడదు. ప్రత్యేకంగా టీవీ స్క్రీన్ల కోసం స్ప్రేలు లభ్యమవుతాయి. వాటిలోనూ ఎలాంటి పదార్థాలు వాడారో చూసిన తర్వాతే టీవీని క్లీన్ చేసేందుకు వినియోగించాలి. అలాగే, స్ప్రేలోని ద్రావణాన్ని నేరుగా టీవీపై వేయకూడదు. ముందుగా మైక్రోఫైబర్ క్లాత్‌పై స్ప్రే చేసి.. దానితో స్క్రీన్‌ను క్లీక్ చేయాలి. ఇలా చేస్తే చుక్కలు కూడా పడకుండా ఉంటుంది.