దుల్కర్ సల్మాన్(dulqur salman)మీనాక్షిచౌదరి(meenakshi chowdhary)హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లక్కీ భాస్కర్.దివాలి కానుకగా అక్టోబర్ 30 న విడుదలైన ఈ మూవీ,మంచి విజయాన్ని అందుకుంది.రాంకీ, టిన్నుఆనంద్,రఘుబాబు,బెనర్జీ,సచిన్ ఖేడ్ కర్, సుధా, సాయికుమార్ ముఖ్య పాత్రలు పోషించగా సితార ఎంటర్ టైన్మేంట్ పై నాగవంశీ నిర్మించాడు.ఇక ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాద్యమం నెట్ ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ఉంది.
అప్పట్నుంచి కూడా లక్కీ భాస్కర్(lucky bhaskar)నెంబర్ వన్ పొజిషన్ లో దూసుపోతుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ,కన్నడ, హిందీ భాషల్లో మొత్తం పదిహేను దేశాల్లో ఓటిటి వేదికగా విడుదలవ్వగా, టాప్ పది దేశాల్లో నెంబర్ వన్ చిత్రంగా లక్కీ భాస్కర్ ముందుకు దూసుకుపోతుంది.దీన్ని బట్టి లక్కీ భాస్కర్ కి ఓ టిటి లో ఎంతటి ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.ఇక లక్కీ భాస్కర్ ఓటిటి లో అడుగుపెట్టకముందు, ఫస్ట్ ప్లేస్ లో ఎన్టీఆర్(ntr)వన్ మ్యాన్ షో దేవర(devara)కొనసాగుతూ ఉండేది.అలాంటిది ఇప్పుడు లక్కీ భాస్కర్ రాకతో దేవర మూడవ స్థానంలో కొనసాగుతుంది.
ఇక ఓటిటిలో సినిమాని చూసిన చాలా మంది ఆనందంతో తనకి మెసేజెస్ చేస్తున్నారని,హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల ఒక ట్వీట్ కూడా చెయ్యడం జరిగింది.బ్యాంకింగ్ సెక్టార్ లోని లోపాలని ఉపయోగించుకున్న ఒక బ్యాంకు ఎంప్లాయ్ తన ఫ్యామిలీ కోసం ఎలా గొప్పోడయ్యాడనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.