ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఇన్ఫ్‌ర్మెషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2047 నాటికి ఒక కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త లక్ష్య సాధనకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం కో వర్కింగ్ స్పేస్‌లు, నైబర్ వర్కింగ్ స్పేస్‌లు క్రియేట్ చేయాలని నిర్ణయించింది. వర్క్ ఫ్రం హోం విధానానికి స్పేస్‌లు డెవలెప్ చేసే వారికి ఇన్సెంటివ్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని రకాల వ్యాపారాలతోపాటు ఐటీ కంపెనీలు అవే భవనాల్లో ఉండాలనే కో-వర్కింగ్ స్పేస్ పనిచేస్తుందన్నారు.
Home Andhra Pradesh నిర్మాణం మొదలుపెట్టని ఇళ్లు రద్దు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే-ap cabinet key decisions pm...