డిసెంబర్ 5న పోలింగ్
డిసెంబర్ 5న ఉభయ గోదావరి జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారులు, సిబ్బందికి సోమవారం నాడు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఐదు జిల్లాల పరిధిలో 16,737 మంది ఓటర్లు ఉండగా 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలో 3418 మంది ఓటర్లు ఉండగా, 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్ టీయూలోని బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తారు.