మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ వర్సెస్ మహీంద్రా బీఈ 6ఈ: స్పెసిఫికేషన్లు..
మాడ్యులర్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్ అయిన ఐఎన్జీఎల్ఓ ఆర్కిటెక్చర్ ఆధారంగా మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, మహీంద్రా బీఈ 6ఈ రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో, 59 కిలోవాట్ల యూనిట్, 79 కిలోవాట్ల ప్యాక్‌లో లభిస్తాయి. మహీంద్రా ఇప్పటికే 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ని విడుదల చేయగా, పెద్ద 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్లను తరువాత విడుదల చేయనుంది.