96తో ఫేమస్…
విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ 96 తో కోలీవుడ్‌లో లైమ్‌లైట్‌లోకి వచ్చింది వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత 96 తెలుగు రీమేక్‌గా వచ్చిన జానులోనూ సేమ్ రోల్ చేసింది. చూసీ చూడంగానే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ పలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్షకులను మెప్పించింది. మిడిల్ క్లాస్ మెలోడీస్, స్వాతిముత్యం , పుష్పక విమానంతో పాటు సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవ కోన సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తమిళం, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది.