ఎస్వీ యూనివర్సిటీలో అన్యమత ప్రచారం వార్తలు కలకలం రేపాయి. ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ చెంగయ్య అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఓ ఆడియో లీకైంది. ప్రొఫెసర్ చెంగయ్య క్లాసులో విద్యార్థులకు ఇతర మతాల గురించి చెప్తున్నారంటూ ఆడియో వైరల్ అవుతోంది. దీంతో ఆగ్రహించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు, చెంగయ్యపై వీసీకి ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్‌ను డిపార్ట్‌మెంట్ నుంచి బయటకు లాక్కొని వచ్చేందుకు ప్రయత్నించడంతో యూనివర్సిటీలో ఉద్రికత్త తలెత్తింది.