PV Sindhu Wedding: భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకటదత్త సాయితో సింధూ వివాహం జరగనుంది. వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. పీవీ సింధూ తండ్రి పీవీ రమణ మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించిన నిర్ణయానికి వచ్చామని చెప్పారు. జనవరి నుంచి పీవీ సింధూ షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈనెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here