తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, పూజా విధానంలో భాగంగా కర్పూరం, హారతి, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం చేస్తున్నారని రైల్వే అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపింది. రైళ్లలో ఇలాంటి పనులు చేయవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. శబరిమల భక్తులకు కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ స్టేషన్ల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. భక్తులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పలు సూచనలు చేసింది.