తెల్లవారుజామునే హత్య..?
రాజామోహన్ ను కాళ్లు, చేతులను కట్టేసి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తాళ్లు, ఇనుప గొలుసులతో బంధించి మరీ కిరాతకంగా హతమార్చారు. రాజా మోహన్ తలపై మూడు చోట్లా, గొంతు సమీపంలో కూడా కత్తి గాట్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా రాజా మోహన్‌ను తన కారులోనే హత్య చేసి, మంగళవారం తెల్లవారుజామున 3.49 గంటల ప్రాంతంలో ఆ కారును రంగంపేటలో పార్క్ చేసి ఓ వ్యక్తి వెళ్లిపోయాడు.