గత కొంత కాలంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి మధ్య వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప2 రిలీజ్‌కి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయోనని బన్నీ ఫ్యాన్స్‌ అందోళన చెందారు. అయితే టికెట్‌ రేట్ల పెంపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రబుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అనుమతులు మంజూరు చేసింది. దీనిపై అల్లు అర్జున్‌ స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి బన్నీ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి మధ్య చిచ్చు పెట్టేందుకు రామ్‌గోపాల్‌వర్మ నడుం కట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే మరోసారి మెగా ఫ్యాన్స్‌ని తన ట్వీట్‌తో కెలికాడు. అది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. 

రామ్‌గోపాల్‌వర్మ చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ‘పుష్ప2కి మెగా క్రేజ్‌ వచ్చింది. కొత్త మెగాస్టార్‌గా అల్లు అర్జున్‌ రాబోతున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. హే.. అల్లు అర్జున్‌.. నువ్వు బాహుబలి కాదు.. కానీ, స్టార్స్‌ అంతా మెగాబలి’ అంటూ చేసిన పోస్ట్‌ మరో కొత్త వివాదానికి దారితీసేలా ఉంది. బన్నీ ఫాన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న వార్‌ కాస్త తగ్గింది అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ చేసిన ట్వీట్‌ మెగా ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. సోమవారం జరిగిన పుష్ప2 ఈవెంట్‌లో మెగా ఫ్యామిలీ ప్రస్తావన రాలేదు. అంతేకాదు, అల్లు అర్జున్‌ కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. ఈ సమయంలో ఆర్జీవీ తన ట్వీట్‌తో కొత్త వివాదానికి తెరతీశారు. ఆ ట్వీట్‌లో విశేషం ఏమిటంటే.. దాని కిందే తన కాంపౌండ్‌ నుంచి వస్తున్న ‘శారీ’ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశాడు వర్మ. జనవరి 30న ఈ సినిమా విడుదల కాబోతోందనేది ఆ పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here