ఆలయ ప్రత్యేకతలు:
పాతాళ సెంబు మురుగన్ ఆలయంలో 18 రకాల మూలికలతో తయారైన విభూతి ప్రసాదం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. ఇది వివిధ వ్యాధులకు నివారణగా పనిచేస్తుందని భక్తుల విశ్వాసం.ఇక్కడ ప్రతి రోజు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 41 రోజుల పాటు స్వామి పాదాల వద్ద ఉంచి, అభిషేకించిన కరుంగళి మాలలు స్వామి కరుణతో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయని, వాటిని ధరిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని భోగర్ సిద్ధాంతం చెబుతుంది. పాతాళ సెంబు మురుగన్ ఆలయం భక్తుల భక్తి, విశ్వాసాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు శ్రేయస్సు, ఆరోగ్యం, మోక్షం పొందుతారని విశ్వాసం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మా శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.