హిందూ ఆచారాల ప్రకారం.. కార్తీకమాసం నుంచి సంక్రాంతి వరకూ ఆలయాలన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో పొటెత్తుతాయి.ఈ మధ్య కాలంలో అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి మండల కాలం పాటు నియమ నిష్టలతో స్వామిని కొలుస్తారు. నిత్యం స్వామి ధ్యాసలోనే సమయాన్ని గడుపుతారు. అయ్యప్ప ఆరాధనలో అయ్యప్ప శరణు ఘోషకు ప్రాముఖ్యత ఎక్కువ. అయ్యప్ప శరణు ఘోష అనేది అయ్యప్ప స్వామిని ప్రార్థించే ఒక పవిత్ర మంత్రం. ఈ ఘోష పఠించడం ద్వారా భక్తులు అయ్యప్ప స్వామి దయ, ఆశీర్వాదాలను పొందగలుగుతారని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. “శరణు” అంటే ఆశ్రయం, రక్షణ లేదా సహాయం కావాలని కోరడం అని అర్థం. “అయ్యప్ప శరణు ఘోష” పఠించడం ద్వారా భక్తులు శాంతి, శ్రేయస్సుతో పాటు భయాలు, కష్టాల నుంచి రక్షణ పొందుతారని నమ్మిక.