(5 / 6)
తొలి విడతలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులకు కూడా స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని,,,. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని కూడా దిశానిర్దేశం చేశారు.