తోటి డాన్సర్ పై లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన ప్రముఖ డాన్సర్ జానీ మాస్టర్(jani master)ఇటీవలే బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. 2009 లో సినీరంగ ప్రవేశం చేసిన జానీ మాస్టర్ తెలుగు,తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలకి కొరియోగ్రఫీ ని అందించి మంచి పేరు సంపాదించాడు. ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘తిరు’ మూవీకి నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నాడు. కానీ కేసు నమోదయిన దృష్ట్యా కమిటీ వాళ్ళు అవార్డుని వెనక్కి తీసుకోవడం జరిగింది.
ఇక జానీ మాస్టర్ కి ఇప్పుడు కొత్తగా ఒక సినిమాకి డాన్స్ మాస్టర్ గా అవకాశం వచ్చినట్టుగా తెలుస్తుంది.బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధావన్(varun davan)కీర్తి సురేష్(kirthi suresh) హీరో హీరోయిన్లుగా హిందీలో బేబీ జాన్(baby john)అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.తమిళంలో విజయ్(vijay)హీరోగా వచ్చిన తేరి(teri)కి రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.ఇప్పుడు ఈ మూవీలోని ఒక స్పెషల్ సాంగ్ కి జానీ మాస్టర్ డాన్స్ సమకూరుస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ విషయంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.