ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,17,298 ఎస్సీ కుటుంబాలకు, 4,75,557 ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది చేకూరుస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేలా ఉచిత విద్యుత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని దళిత, గిరిజన సోదరులు నమ్మవద్దని కోరారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Home Andhra Pradesh 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన-minister gottipati ravikumar statement on...