లంచం తీస్కోంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వ్యవసాయ శాఖ అధికారి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ వద్ద గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా మార్కెట్ కమిటీ వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కొత్త లైసెన్స్ రెన్యువల్ కు పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా, ఏడు వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారని, ఇవాళ రూ.7 వేలను కార్యాలయంలో ఏడీ శ్రీనివాస్ కు బాధితుడు వెంకట్ ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఏసీబీ అధికారుల వరుస దాడులతో అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తుంది.