BayOfBengal Depression: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. శుక్రవారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 6,7 తేదీల్లో ఏర్పడే అల్పపీడనం దక్షిణ దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. శుక్రవారం నాటికి అల్పపీడనం గమనం, ప్రభావంపై స్పష్టత రానుంది.