మీనా రచ్చ…
రోహిణితో పాటు బాలు, మనోజ్‌లను కిచెన్‌లోకి పిలుస్తుంది మీనా. తాను చేసిన వంటలకు అందరికి చూపిస్తుంది. ఇందులో ఏ బల్లి, నల్లి పడలేదని చెబుతుంది. తాను లేనప్పుడే అన్ని సాంబార్‌లో పడతాయని చెబుతుంది. వంటల విషయంలో అజాగ్రత్తతో ఉన్నట్లు అందరూ మాట్లాడుతున్నారని, అవమానించడం, అనుమానించడం మా హక్కు అన్నట్లు…బాధపడటం, భరించడం నా ప్రాప్తం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని మీనా అందరితో అంటుంది.