ప్రభుత్వ తప్పులకు..
2007 నుంచి 2017 వరకు పంజాబ్ (punjab) లోని శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం చేసిన తప్పులకు బాదల్, ఇతర నాయకులకు ‘టంఖా’ (మతపరమైన శిక్ష) విధించిన అకాల్ తఖ్త్ లోని సిక్కు మతాధికారులు సోమవారం సీనియర్ అకాలీ నాయకుడిని ‘సేవదార్’గా పనిచేయాలని, స్వర్ణ దేవాలయంలో గిన్నెలు కడగాలని, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించారు.