డయాబెటిస్ ఉండే పల్లీలు తినవచ్చా?
మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేరుశెనగ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేరుశెనగలో లభించే మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. వేరుశెనగ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే వేరుశెనగ తిన్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. ఇది కాకుండా, వేరుశెనగలో అసంతృప్త కొవ్వు, సూక్ష్మపోషకాలు, ప్రోటీన్, మెగ్నీషియం, ఫైబర్ ఇలా అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటిస్ పేషెంట్లు వేరుశెనగ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.