ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)ఈ నెల ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.పైగా ఈ రోజు నైట్ నుంచి ప్రీమియర్ షోస్ తో పాటు బెనిఫిట్ షోస్ కూడా పడనున్నాయి. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా సందడి వాతావరణం నెలకొని ఉంది.
ఇక పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం(pitapuram)నియోజక వర్గంలో కొంత మంది పుష్ప వాల్ పోస్టర్స్ ని చించి వెయ్యడం జరిగింది.మరొకొన్ని గంటల్లో స్క్రీన్ పై సినిమా పడనుండగా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే మెగా ఫ్యాన్స్ నే పోస్టర్స్ ని చించారని అంటున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.